పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది.