BrahMos: స్వదేశీ టెక్నాలజీ, ఆత్మ నిర్భర భారత్‌లో కీలక మైలురాయికి చేరుకుంది. కొత్తగా లక్నోలో ప్రారంభించిన ఫెసిలిటీతో తయారైన ‘‘బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి’’ మొదటి బ్యాచ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జరగబోయే వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు హాజరుకానున్నారు.
Hypersonic missiles: ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, కొత్తగా ఇప్పుడు బంగ్లాదేశ్.. ఇలా భారత్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. అయితే, వీటిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్ ఇటీవల కాలంలో తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా పాకిస్తాన్, చైనాలకు తెలిసి వచ్చింది. ఇక ముందు కూడా ఈ రెండు దేశాలకు భయపడేలా భారత్ పెద్ద ప్రాజెక్టుకే శ్రీకారం చుట్టింది.
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్‌మైన్‌లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.