ఇజ్రాయెల్ అంతిమ యుద్ధం చేస్తామంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ను తుడిచిపెడతామంటోంది. ఏకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళానికి, ఇరాన్ క్షిపణుల సామర్థ్యానికి మధ్య నేరుగా పోరు జరుగుతోంది. రెండువైపులా జరుగుతున్న నష్టం తీవ్రంగానే ఉందనే అంచనాలున్నాయి. యుద్ధం కొనసాగితే.. ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి.. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అనుకోని యుద్ధం కొత్త షాక్ ఇచ్చింది.…
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. టెహ్రాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అమెరికా కూడా వార్నింగ్‌లు ఇస్తోంది. అణు ఒప్పందం చేసుకుంటారా, లేదా.. ఖబర్దార్ అంటూ టెహ్రాన్‌ను హెచ్చరిస్తోంది. మరో యుద్ధం ముంచుకొస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న సమరం.. గాజాలో కొనసాగుతున్న అలజడి.. వీటికితోడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి.. ఇతర దేశాలు ఎంటరైతే! ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయి.. సమరశంఖం పూరిస్తాయా ? మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా ? ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..…
Story Board : హైదరాబాద్ చుట్టూ డేంజర్ జోన్ ఏర్పడింది. సిటీ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌసులు, రిసార్టుల్లో తరచుగా డ్రగ్స్, రేవ్ పార్టీలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మంగ్లీ బర్త్ డే పార్టీ రచ్చతో మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది. వీటికి తోడుగా సిటీలో పబ్ కల్చర్ ఉండనే ఉంది. నగరం నిద్రపోతున్నవేళ జరిగే కార్యకలాపాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. Harish Rao : ఇది మార్పా రేవంత్…
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో కథ. తెలంగాణలో ఆదాయం తగ్గకపోయినా.. అప్పులు పెరుగుతున్నాయి. ఏపీలో ఆదాయం పెరగడం లేదు. అప్పులు పేరుకుపోతున్నాయి. పైగా అప్పులు తీర్చడానికి అప్పులు చేయక తప్పని విష విలయం రెండు రాష్ట్రాల్లో నడుస్తోంది.
తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ కు వెలితిగా ఉంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మూడోసారి ఎలాగైనా పవర్లోకి రావాలని పట్టుదలగా ఉంది. అయితే సంస్థాగత లోపాలు పార్టీని వెంటాడుతున్నాయి. నేతల మధ్య అనైక్యత కూడా శాపంగా మారింది. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనలోనూ నేతలు తలోదారిగా ప్రవర్తిస్తుండటంతో.. శ్రేణులకు మింగుడుపడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటల్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వైఖరులే పార్టీ పుట్టి ముంచుతున్నాయని…