నాలుగురోజుల వరుస నష్టాలకు ఈరోజు తెరపడింది. భారత స్టాక్‌మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 55,320 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 16,478 వద్ద ముగిసింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం ప్రభావం ఎక్కువేమీ స్టాక్ మార్కెట్లపై పడలేదు. మధ్యాహ్నం వరకు రేంజ్ బౌండ్‌లో కదలాడిన సూచీలు సాయంత్రానికి సర్రున పైకి ఎగిశాయి. దీంతో లాభాలను చవిచూశాయి. ఉదయం 10 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్…