దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తాజా రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఇలా నిఫ్టీ అయితే ఆల్ రికార్డ్ సొంతం చేసుకుంది. 23, 560 మార్కును క్రాస్ చేసింది.
Stock Market Record: భారత స్టాక్ మార్కెట్లో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కొత్త ఊపును పొందింది. సెన్సెక్స్ తొలిసారిగా 77,000ను అధిగమించగా, నిఫ్టీ 23400 స్థాయిని దాటి చారిత్రక శిఖరానికి చేరుకుంది.
దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 692, నిఫ్టీ 201 పాయింట్లు పెరిగాయి. ఈ వారంలో షేర్ మార్కెట్ రెండు సార్లు రికార్డులు సృష్టించింది. సోమవారం రోజున మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. మంగళవారం రోజున మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ఒడిదుడుకులకు ఎన్నికల ఫలితాలే కారణం. బుధ, గురువారాల సెషన్లలో స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగింది. కాగా.. భారీ…
లోక్సభ ఎన్నికల ఫలితాల రోజైన మంగళవారం స్టాక్ మార్కెట్లో భారీ భూకంపం సంభవించింది. అదే సమయంలో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ 6000 పాయింట్లకు పైగా పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 1900 పాయింట్ల వరకు పడిపోయింది.
నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలాడిపోయారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలు నమోదు అయిన రోజుగా రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. అయితే…
Stock Market Today : 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న స్టాక్ మార్కెట్కు ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎన్డీయే కూటమి తొలి ట్రెండ్స్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభం కాగా.. ముగింపు కూడా స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి.. 75,410 దగ్గర ముగియగా.. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 22,957 దగ్గర ముగిసింది.
గురువారం భారీగా పతనమైన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1,000 పాయింట్లకు పైగా నష్టపోయి ఇన్వెస్టర్లకు నష్టాలను చవిచూపించిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఊరటనిచ్చింది. ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లకు దిగడంతో సూచీలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు, అధిక వెయిటెడ్ స్టాక్స్ లాభపడటంతో సెన్సెక్స్ స్వల్పంగా పెరిగింది. Also Read: Team India: టీమిండియాలో పునరాగమనం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన బౌలర్.. సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 72,475 వద్ద…
నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 1062.22 పాయింట్లతో 1.45 శాతం తగ్గి 72,404.17 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 335.40 పాయింట్లతో 1.5 శాతం క్షీణించి 21,967.10 వద్ద ముగిసింది.