ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ప్రబాత్ జయసూర్య వేసిన 31 ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన స్మిత్.. సాంప్రదాయ ఫార్మాట్‌లో 10 వేల రన్స్ పూర్తి చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 115…