Steel Bridge: ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2.25 కి.మీ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు.
Minister KTR: హైదరాబాద్ వాసులకు మరో వంతెన అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.