Station Master: ఆ రోజుల్లో దర్శకుడు కోడి రామకృష్ణ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం అటు నిర్మాతల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. కోడి రామకృష్ణ రూపొందించిన చిత్రానికి వెళ్తే, టిక్కెట్ రేటుకు సరిపడా వినోదం ఖాయమని భావించి, ఆయన సినిమాలకు పరుగులు తీసేవారు జనం.