BJP Andhra Pradesh president PVN Madhav : పెట్రోల్‌పై జీఎస్టీ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచల వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై కేంద్రం విధిస్తున్న జీఎస్టీ 18 శాతమేనని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే జీఏస్టీ దీనికి రెండు రెట్లు అదనంగా ఉంటోందని అన్నారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో రెండు రోజులు పాటు నిర్వహించిన ఖాదీ సంతను మాధవ్ సందర్శించారు.