చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. కాగా.. పొగమంచు పగబడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఈ సీజన్‌లో కురిసే మంచు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు నవంబరు, డిసెంబరు, జనవరిల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు కూడా చలికాలంలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటించండి.
రాష్ట్రంలో అధికార పార్టీకి, మా చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత లేదన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్ర రహదారులు , జాతీయ రహదారుల మీద ప్రజల్లో చర్చకు వైసీపీ ప్రభుత్వం వస్తుందా? రాష్ట్రంలో దాదాపు 90 వేల కోట్లు పైబడి నిధులతో జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. నేడు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రహదారులకు చేయవలసిన చిన్న…