చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది.…