రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి బిజెపి యువ నేతల్లో ఒకరైన తేజస్వి సూర్యని తప్పించింది. అయితే, బీజేపీ బుధవారం విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేదు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర, కేంద్రం నుంచి పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడి ఉన్న తేజస్వీ సూర్య.. బెంగళూరు సౌత్ పార్లమెంటు సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పార్టీ హిందుత్వ ఎజెండాకు ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతిపక్ష పార్టీలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై విమర్శలకు అతను ప్రసిద్ధి చెందాడు.
Also Read:Oxfam India: విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఆక్స్‌ఫామ్ ఇండియాలో సీబీఐ సోదాలు
స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి సూర్యను తప్పించడం అనేది పార్టీలో అతని పట్ల ప్రతికూల దృక్పథానికి సంకేతం కాదని బీజేపీ వర్గాలు తెలిపాయి. సూర్య పార్టీ కోసం ఎలాగూ ప్రచారం చేస్తున్నాడని కాషాయ నేతలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అన్ని సమయాలలో ప్రచారం చేసే బాధ్యత ఉందన్నారు. సూర్య జాబితా నుండి లేకపోవడం వల్ల ఎన్నికల ప్రచారంలో అతను కనిపించడం లేదని అర్థం కాదని చెబుతున్నారు. ఈ విషయంపై సూర్య ఇంకా స్పందించలేదు. యువ నేతలందరినీ జాబితా నుంచి తప్పించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Also Read: Judges Transfer : తెలంగాణలో భారీగా జడ్జీల బదీలు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని తేజస్వి సూర్యను కొందరు నేతలు కోరారు. రేపు పుత్తూరు, బైందూరు, షిమోగాలలో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. షికారిపుర స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను కూడా బీజేపీ చేర్చుకోలేదు. జూలైలో తన తండ్రి రాజీనామా చేసినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్తం 224 మంది స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్), బిజెపి గట్టి పోటీ ఉంది. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.