Harish Rao : జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ఆయన అన్నారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అని హరీష్ రావు మండిపడ్డారు. చర్యలు…
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలోని రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 100 మందికి పైగా భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు అధికంగా పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.