ఒక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అంతేకాదు.. అతని ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు చెల్లదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె కేసుకి సంబంధించి హైకోర్టు నియమించిన అప్పిలేట్ అథారిటీ ఊరట కలిగించింది. ఆమె ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి చెందిన…