తెలుగు రాష్ట్రాల్లో లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోని కడపలో కూడా ఇలాంటి లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ అయింది.
ఏపీలో టెన్త్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీక్‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, పేపర్ లీక్‌ల వ్యవహారంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం, విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురి కావొద్దు, ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షలపై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.. పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. Read…