పవిత్రమైన ఆచారాలను నిర్వహించే పూజారులే అసభ్యంగా ప్రవర్తించారు. ఆలయం ప్రాంగణంలోనే మందు పార్టీ చేసుకున్నారు. అంతేకాదు మద్యం మత్తులో అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. పూజారుల చేసుకున్న మందు పార్టీకి సంబందించిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు పూజారులపై కేసు నమోదు అయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. భక్తులు మండిపడుతున్నారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రసిద్ధ పెరియ మరియమ్మన్ ఆలయంలో 28 ఏళ్ల తరువాత పవిత్ర కుంభాభిషేకం జరుగుతోంది. ఈ కుంభాభిషేకానికి…