(జూలై 24న శ్రీవిద్య జయంతి) ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే అభినయం, ఆకట్టుకొనే అందంతో శ్రీవిద్య అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ శ్రీవిద్య తనదైన నటనతో మురిపించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన “తాత-మనవడు, తూర్పు-పడమర, బంట్రోతు భార్య, బలిపీఠం, కన్యా-కుమారి” వంటి చిత్రాలతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించారు. తరువాతి తరం హీరోలకు తల్లిగా నటించి అలరించారు. ఆమె నటించిన పలు అనువాద చిత్రాలు సైతం జనాన్ని మెప్పించాయి. శ్రీవిద్య తల్లి ప్రఖ్యాత కర్ణాటక సంగీత…