ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు త్రిమెన్ కమిటీ నేడు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల సమావేశాన్ని కేంద్ర జల శక్తి శాఖ చేపట్టనుంది.
భారీగా కురుస్తున్న వర్షాల వల్ల తెలుగురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రాజెక్టులకు ఇంకా వరద కొనసాగుతోంది. గోదావరి, కృష్ణతో పాటు వాటి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉరకలెత్తుతున్న వాగుల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి.
Krishna Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నది శాంతించింది. దీంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11 అడుగులకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 9.7 లక్షలు, కాలువలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల…