PM Modi Visits Srisailam Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలంకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ శైలంకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేశారు. కాసేపట్లో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.…
శ్రీశైలం ఆలయంలో అభిషేకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు వెల్లడించారు.