శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా 15వ తేదీ నుంచి 18 వరకు ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
Beautiful View of Srisailam Dam in Night: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం వరకు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తంగా 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి…