మన దేశంలో రాజకీయ, సినిమా రంగం జమిలిగా కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నాయి. చిత్రసీమకు చెందిన ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రాణించారు. మరెందరో సినీ ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగానూ పనిచేశారు. మరెందరో సొంత పార్టీలూ పెట్టారు. అయితే… సోమవారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలకు మాత్రం ఓట్లరు చుక్కులు చూపించారు. మరీ ముఖ్యంగా తమిళనాట ‘మక్కల్ నీది కయ్యం’…