తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురైంది అక్కడి ప్రభుత్వం. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం వల్ల అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఉన్న తమ నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.