భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాముడు కంటే గొప్పగా ప్రజాపాలన అందించే దేవుడు లేడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారికి రాముడే ఆదర్శం.. ప్రజలు కోరుకున్నది అందించే ఏకైక రాజు శ్రీరామచంద్రమూర్తి అని తెలిపారు. కాబట్టి రాముడిని స్ఫూర్తిగా…