ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు.
రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.