Bhadrachalam LIVE: సకల శుభప్రాప్తికై.. సకల అభీష్టసిద్ధికై.. మోక్షప్రాప్తికై.. జరిగే అపురూపమైన మహోత్సవము.. భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం. భద్రాచల క్షేత్రంలో మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మల కల్యాణ ఘట్టాన్ని అశేష భక్తజన సమక్షంలో నిర్వహిస్తున్నారు. శీరామ నవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం.. ప్రత్యక్షప్రసారం వీక్షించండి.