Sri Ramanavami LIVE Updates: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్య, భద్రాచలంతో పాటు దేశంలోని ప్రముఖ రామాలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతోంది. భద్రాచలంలో 10.30 నుంచి 12.30 వరకు రాములోరి కల్యాణ మహోత్సవం కొనసాగనుంది. రాముల వారి కల్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ప్రారంభమైన శ్రీ రాముని శోభాయాత్ర.. గోశాల నుంచి ప్రధాన వీధులగుండా రాంలీలా మైదానం వరకు కోనసాగనున్న శోభాయాత్ర.. ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ , హిందువాహిని బీజేపీ నాయకులు.. శోభయాత్రలో పోలీసుల భారీ బందోబస్తు.. బందోబస్తును పర్యవేక్షిస్తున్న భైంసా ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్.
ముషీరాబాద్ నియోజకవర్గంలో వివిధ దేవాలయాల్లో నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్..
కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో జరుగుతున్న సీతారామచంద్ర స్వామి కల్యాణంలో పాల్గొన్న బండి సంజయ్
భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ.. మిథిలా స్టేడియంలో రాములోరి కళ్యాణ వేడుక.. మధ్యాహ్నం 12గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తానా సీతారాముల కళ్యాణం.. రామయ్య కళ్యాణాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు..
పోలీసులు సూచించిన మార్గంలోనే శ్రీరామనవమి శోభాయాత్ర.. శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు.. హైదరాబాద్ లో మధ్యాహ్నం. 12. 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభం..
భక్తజన సంద్రంగా అయోధ్య నగరం.. బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు.. భారీ ఏర్పా్ట్లు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. మధ్యాహ్నం 12గంటలకు సూర్యతిలకం వేడుక..
శ్రీ సత్యసాయి జిల్లాలోని శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం.. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి భారీగా తరలివచ్చిన దేశ, విదేశీ భక్తులు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం.. వైభవంగా ప్రారంభమైన సీతారాముల కళ్యాణం మహోత్సవం.. వేద మంత్రోచ్ఛారణ ల నడుమ ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. ఐదు వందల ఏళ్ల తరువాత తొలిసారి అయోధ్యలో శ్రీ రామనవమి వేడుకలు జరుగుతున్నాయి.. ధ్వంసం చేయబడిన గుడులన్నింటినీ పునర్నిర్మిస్తాం.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టాన్ని మారుస్తాం.. రామ దూతగా వచ్చి మోడీ అయోధ్య రామాలయాన్ని నిర్మించాడు.. ఎలాంటి ప్రకృతి విపత్తులు రాకూడదని, సమృద్ధిగా వర్షాలు పడాలని రాముడ్ని కోరుకుంటున్నాను- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
వేములవాడలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ సీతా రాముల కళ్యాణం.. కళ్యాణ వేదిక వద్దకు ఉత్సవ మూర్తులను ఎదుర్కొచ్చిన ఆలయ అధికారులు.. స్వామి వారికి ఆలయం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్ దంపతులు.. జోగినిలు, శివ పార్వతులతో సందడిగా మారిన రాములోరి కల్యాణం వేడుక..
భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణానికి హాజరైన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి