తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి మే 28న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన నటవారసుడు నందమూరి బాలకృష్ణ తన గానంతో ఓ నివాళి సమర్పిస్తున్నారు. శ్రీరాముని పాత్రలో యన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి, సి.ఐ.డి. చిట్టిచెల్లెలు, అడవిరాముడు” వంటి సాంఘికాలలోనూ శ్రీరాముని పాత్రలో కనిపించి అలరించారు యన్టీఆర్. తెలుగువారి…