దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ…