Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి.. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు.. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది.. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసురమర్దని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే, శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్దనికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకో పకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.. సింహావాహినిగా రూపొందిన శక్తి…