తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో ఈసారి ప్రధాని కార్యాలయం మీద ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ…