దక్షిణాసియాలో మొదటి డిస్నీల్యాండ్‌ను హంబన్‌టోటాలో ఏర్పాటు చేయడంపై చర్చలు జరపడానికి డిస్నీల్యాండ్ బృందం నవంబర్‌లో శ్రీలంకను సందర్శించేందుకు అంగీకరించింది. శ్రీలంకలో డిస్నీల్యాండ్‌ను ప్రారంభించేందుకు డిస్నీల్యాండ్ అధికారులు తనతో చర్చలు జరుపుతున్నట్లు ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి డయానా గమేజ్ గతంలో తెలిపారు.