‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ వశిష్ట, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా సరస్వతి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 గా రూపొందుతోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం మొదలైంది. ఈ సినిమాకి శ్రీ చైతు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి పాపులర్ సింగర్ సునీత క్లాప్ నివ్వగా నిర్మాత డా. అన్నదాత భాస్కర రావు స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశారు. దర్శకుడు శ్రీ చైతు మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ…