ఆ నియోజకవర్గ హస్తం పార్టీలో నేతల చేతులు కలవడం లేదు. ఇక మనసులు, మాటల గురించి అయితే చెప్పే పనేలేదు. సర్ది చెప్పాల్సిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఓ వర్గాన్ని సపోర్ట్ చేస్తూ… అగ్గికి ఆజ్యం పోస్తున్నారట. రెండు వర్గాలు వేర్వేరుగా మీటింగ్స్ పెట్టుకుంటే రెండు చోట్లకు వెళ్తున్న ఆ మంత్రివర్యులు ఎవరు? ఏ జిల్లాలో, ఎందుకా పరిస్థితి వచ్చింది? సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు టిడిపి హవా కొనసాగగా… ఆ తర్వాత…