తెనాలి పెమ్మసాని థియేటర్‌లో నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమని మండిపడ్డారు. ‘‘ఒక్క ఛాన్స్ అంటే, ఒక్క తప్పిదం చేశారు, ఓటు వేశారు, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి’’ అంటూ ఏపీ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘దేశమంటే కట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు.…