కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. ఇప్పటికే తొలి కాపీని సిద్ధం చేసుకున్న ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు ప్రమోద్, రాజు చెబుతూ వచ్చారు. అన్నమాట ప్రకారమే ఈ సినిమాను ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. సో… ఈ నెలాఖరుకు ఏపీ, తెలంగాణాలో థియేటర్లు తెరుచుకోగానే తొలుత ‘తిమ్మరుసు’ చిత్రం రానుంది. ఆ వెనుకే ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’…
‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా నిజానికి ఇదే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తాజాగా తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే…