భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ను అనేక ప్రాంతాల్లో అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ సంస్థ రష్యానుంచి దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నది. అయితే, రష్యాలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన గమలేరియా సంస్థ సింగిల్ డోస్ లైట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లైట్ వెర్షన్ డోసులను రష్యాలో ప్రజలకు అందిస్తున్నారు. Read: అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!!…
ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు…
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 150 కంటే ఎక్కువ సేవా ఛార్జీగా వసూలు చేయడానికి అనుమతించవద్దని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు ఆస్పత్రులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను…
కరోనాకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడు మనముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషనే అని వైద్యనిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు మాత్రం.. రెండు డోసులు తీసుకోవాలి.. మొదటి డోస్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ ప్రొటోకాల్‌ను అనుసరించి రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఒక్క వ్యాక్సిన్‌తో పనిముగించే సంస్థలు కూడా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ గుడ్‌న్యూస్ చెప్పింది.. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ…
దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా మే 1 వ తేదీ నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా దేశంలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి డిసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. మే 1 వ తేదీన కొన్ని వ్యాక్సిన్లు రష్యా నుంచి ఇండియాకు దిగుమతి కాగా, నిన్నటి రోజున మరికొన్ని వ్యాక్సిన్లు దిగుమతి అయ్యాయి. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డ్రైవ్…
దేశంలో ఇప్పటికే రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రజలకు అందిస్తున్నారు. అయితే, ఇప్పుడు మూడో వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చింది.. రష్యా కు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా మే 1 నుంచి దేశంలో అందుబాటులో ఉన్నది. అయితే, ఈ వ్యాక్సిన్ ను ఇంకా ఎవరికీ అందించలేదు. ఈ వ్యాక్సిన్ డోస్ ధరను తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఎమ్మార్పీ రూ.948 జీఎస్టీతో కలుపుకొని 995.40…
కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ ను సెర్చ్ చేస్తాం. అయితే, ట్విట్టర్ తో నిత్యం టచ్ లో ఉండే వ్యక్తులు కొత్త విషయాల కోసం ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ అకౌంట్ ను సెర్చ్ చేస్తుంటారు. కొత్త కొత్త విషయాలతో పాటుగా అప్పుడప్పుడు మెదడకు పదును పెట్టె క్విజ్ లను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఓ గోళం, దానికి నాలుగు తీగలు ఉన్న…
మనదేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నది. అయితే, 60 నుంచి 70 శాతం ఈ వ్యాక్సిన్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నది. ఇండియాలో జూన్ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు కావడంతో దీని ధర…