Sprouts: మొలకెత్తిన గింజలు (మొలకలు) మన భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. కానీ వాటిని పచ్చిగా తినాలా లేదా ఉడికించి తినాలా? అనే విషయంలో చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం. మొలకలు ఎంజైమ్‌లు, పీచు, విటమిన్లతో నిండి ఉంటాయి. అవి శక్తి, జీర్ణక్రియకు చాలా మంచివి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే.. మొలకలు తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు. కాబట్టి, వాటిని తినడానికి ముందు బాగా కడగండి.…