అమెరికా యూనివర్సిటీల్లో తాజాగా మరో కలవరం చోటుచేసుకుంది. గత వారం పాలస్తీనా అనుకూల నిరసనలతో విశ్వవిద్యాలయాలు అట్టుడికాయి. మరోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తీవ్ర కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనకారులు అమెరికా జెండా స్థానంలో పాలస్తీనా జెండాను ఎగురవేశారు.