స్వప్రలోక్ ఘటన మరువక ముందే.. హైదరాబాద్ అబిడ్స్‌లో మరో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే వున్న కారు మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆమంటలు గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
Satya Nadella, GMR: మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండ్ సీఈఓ సత్యనాదెళ్ల.. క్రికెట్లోకి అడుగుపెట్టారు. అమెరికాలో కొత్తగా ప్రారంభమవుతున్న టీ20 టోర్నీలో పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. మేజర్ లీగ్ క్రికెట్‌గా పేర్కొనే ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఒక టీమ్‌ని సత్యనాదెళ్ల ఫైనాన్షియల్‌గా ప్రమోట్ చేయనున్నారు. ఆ జట్టు పేరు.. సియాటల్ ఆర్కాస్. దీనికి సంబంధించిన ఫ్రాంచైజీ నిర్వహణ కోసం ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రికెట్ లీగ్ జులైలో లాంఛ్ కాబోతోంది.