IND Vs NZ: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్, గిల్ శుభారంభాన్నిచ్చారు. అయితే 13వ ఓవర్లో రోహిత్‌ను టిక్నర్ ఔట్ చేయడంతో మొదటి వికెట్‌కు 60 పరుగుల…
Shubman Gill: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి మెరిశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతన్న మొదటి వన్డేలో సెంచరీతో సత్తాచాటాడు. వన్డేల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే భారత జట్టు తరఫున అత్యధిక వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే కెరీర్లో ఆడిన 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ (24 ఇన్నింగ్స్‌లు) పేరుమీదున్న…
Rohit Sharma: టీమిండియా కెప్టె్న్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. స్వదేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచిన హిట్‌మ్యాన్.. ధోనీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హెన్రీ షిప్లే వేసిన ఐదో ఓవర్లో సిక్స్ కొట్టడం ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం భారత గడ్డపై రోహిత్ 125 సిక్స్‌లతో మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ (123) రెండో ప్లేస్‌కు పడిపోయాడు.…
Junior NTR: మంగళవారం నాడు హైదరాబాద్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను టీమిండియా క్రికెటర్లు కలవడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సందర్భంగా హైదరాబాద్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేకంగా ఎన్టీఆర్‌ను కలిసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే తన సతీమణి దేవిశాతో కలిసి ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా ఫొటో దిగాడు. ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సూర్యకుమార్.. ‘బ్రదర్, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.…
Tom Latham: బుధవారం నాడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే సందర్భంగా మంగళవారం నాడు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్.. అందులోనూ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగబోతోంది కాబట్టి తమకు ఈ సిరీస్ ముఖ్యమైనదిగా భావిస్తున్నామని టామ్ లాథమ్ తెలిపాడు. విలియమ్సన్, సౌథీ లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించిందని. ఇది కూడా మంచి…
Team India: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మిడిలార్డర్లో కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే అతడిని వన్డే సిరీస్ నుంచి తప్పించామని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తున్నాడని తెలిపింది. అక్కడ నిపుణుల సమక్షంలో రిహాబిలిటేషన్ పొందుతాడని బీసీసీఐ పేర్కొంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రజత్ పటీదార్‌ను ఎంపిక చేసినట్లు వివరించింది. Read Also:…
Rishab Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేశాడు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, కోలుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైందని, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రిషబ్ పంత్ అన్నాడు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు…
Robin Uthappa: ఇటీవల కాలంలో టీమిండియా ఎంపిక విషయంలో సెలక్టర్లపై తరచూ విమర్శలు వస్తున్నాయి. జట్టును సరిగ్గా ఎంపిక చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో టీమిండియా చతికిలపడిందనే వాదన ఉంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరును తప్పుబట్టాడు. గత ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్లేయర్…
Team India: బుధవారం నాడు ఉప్పల్ వేదికగా హైదరాబాద్ నగరంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరింది. ఈరోజు ఉదయమే విరాట్ కోహ్లీ హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన సభ్యులు సాయంత్రం వచ్చారు. టీమిండియా రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు టీమిండియా క్రికెటర్ల కోసం అధికారులు ప్రత్యేక…