జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా నేడు రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో 26వ మ్యాచ్ సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడునుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగనుంది.
Also Read : Priyanka Chopra: బెడ్ సీన్స్ .. ఆ పార్ట్స్ కనిపించకుండా చేతులను అడ్డుపెట్టి
ఇదిలా ఉంటే. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో రెండో స్థానంలో ఉంది. అలాగే.. లక్నో సూపర్ జెయింట్స్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఫాంలో ఉంది. అయితే.. ఈ రెండు జట్ల మధ్య నేడు ఉత్కంఠ పోరు జరుగనుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆటగాళ్ల ఫామ్ విషయానికి వస్తే.. లక్నో కంటే రాజస్థాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత గ్రౌండ్‌లో ఆడటం ఆ జట్టుకు అదనపు అడ్వాంటేజ్ కానుంది. లీగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో రాజస్థానే విజయం సాధించింది.
Also Read : Perfumes : మగవారు ఆ టైమ్‌లో ఈ పెర్ఫ్యూమ్స్ వాడితే.. ఆడవారికి చాలా ఇష్టమట..
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జోరెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్, మార్కస్ స్టాయినిస్, ఆయుష్ బదోనీ, నవీన్ ఉల్ హఖ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, యుధ్‌వీర్ చరక్