వైన్ షాపులు బంద్: భారతీయులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్త్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైన్ షాపులను కూడా బంద్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.…
Olympics: క్రికెట్ అభిమానులకు శుభవార్త. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చవచ్చు. క్రికెట్‌తో పాటు, ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్ బాల్, సాఫ్ట్‌బాల్‌లను చేర్చవచ్చు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో జరగాల్సి ఉంది.
నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు’ కేసు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఏసీబీ నుంచి…
క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీన వన్డే ప్రపంచ కప్ ప్రారభం కాబోతోంది. ఈ వేడుకకు భారత్ వేదిక కాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ – న్యూజిలాండ్ దేశాల మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో తలపడనున్నాయి. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో కమిన్స్ సేనతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 8న…
Asian Games 2023: 19వ ఎడిషన్ ఆసియా క్రీడలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో ఆసియాలోని 40 విభిన్న క్రీడలు, 45 దేశాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొంటారు.
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది.
WWE Event: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న భారత్ కల నెరవేరింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సాధించాడు. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జెండా రెపరెపలాడింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా సత్తాచాటాడు.హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చరిత్రను తిరగరాశాడు. స్వర్ణ పతకం గెలిచాడు. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. జావెలిన్ త్రో…
ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో విండీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. రెండూ మ్యాచ్‌లు ఓడిపోయి మరో ఓటమి ఎదురైతే సిరీస్ చేజారే పరిస్థితిలో పుంజుకున్న టీమిండియా.. మూడో టీ20లో గెలిచి హమ్మయ్య అనుకుంది.