తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరగనుంది. మిథిలా స్టేడియంలోని శిల్ప కళాశోభిత కళ్యాణ మండపం ఈ మహోత్సవానికి వేదిక కానుంది. ప్రత్యేక ఆకర్షణగా, తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 2016 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ…