ఆర్జీవీ తర్వాత సినిమా డైనమిక్స్ ని కంప్లీట్ గా మార్చే ఆ రేంజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. చేసింది మూడు సినిమాలే, అందులో ఒకటి రీమేక్ అయినా కూడా హ్యూజ్ క్రెడిబిలిటీని సంపాదించుకున్నాడు సందీప్. మూడున్నర గంటల నిడివి సినిమాతో కూడా ఆడియన్స్ ని కూర్చోబెట్టాడు అంటే కథ చెప్పడంలో సందీప్ రెడ్డి వంగ కన్విక్షన్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాతో సందీప్ స్థాయి అండ్ మార్కెట్ మరింత పెరిగాయి.…