ఆర్జీవీ తర్వాత సినిమా డైనమిక్స్ ని కంప్లీట్ గా మార్చే ఆ రేంజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. చేసింది మూడు సినిమాలే, అందులో ఒకటి రీమేక్ అయినా కూడా హ్యూజ్ క్రెడిబిలిటీని సంపాదించుకున్నాడు సందీప్. మూడున్నర గంటల నిడివి సినిమాతో కూడా ఆడియన్స్ ని కూర్చోబెట్టాడు అంటే కథ చెప్పడంలో సందీప్ రెడ్డి వంగ కన్విక్షన్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాతో సందీప్ స్థాయి అండ్ మార్కెట్ మరింత పెరిగాయి. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో చేయనున్న స్పిరిట్ సినిమా కథని మొదలుపెట్టే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ ఉన్న ఐడియాని కంప్లీట్ కథగా మార్చనున్నాడు సందీప్. ఈ సినిమాతో ప్రభాస్ ని పోలీస్ గా చూపించి పాన్ ఇండియా రేంజులో ఇండస్ట్రీ హిట్ కొడితే సందీప్ రేంజ్ ఆకాశాన్ని తాకుతుంది. సెప్టెంబర్ 2024 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్న సందీప్ కి ప్రభాస్ పక్కన ఈ హీరోయిన్ ని సెట్ చెయ్ అంటూ మెసేజులు వస్తున్నాయట. అనిమల్ సినిమాలో ‘భాబి 2’గా ‘జోయా’ పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రీకి చాలా మంచి పేరొచ్చింది.
తెరపై కనిపించింది కాసేపే అయినా త్రిప్తి నేషనల్ క్రష్ గా మారిపోయింది. యూత్ అంతా త్రిప్తి ఫోటోలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఆమె క్రేజ్ ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం త్రిప్తి తప్ప యూత్ కి ఇంకో పేరు వినిపించట్లేదు, ఆమె ఫోటో తప్ప ఇంకోకటి కనిపించట్లేదు. ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాలో త్రిప్తిని హీరోయిన్ గా తీసుకోమని మెసేజులు వస్తున్నాయని స్వయంగా సందీప్ రెడ్డి వంగనే చెప్పడంతో… ఈ కాంబినేషన్ సెట్ చెయ్ వంగ మావా అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పడుతున్నాయి. మరి ప్రభాస్ అభిమానుల కోరికని సందీప్ రెడ్డి వంగ నిజం చేస్తాడా లేక ఆ టైమ్ కి ఇంకో హీరోయిన్ ని సెట్ చేస్తాడా అనేది చూడాలి.