విమాన ప్రయాణం ఆషామాషీ కాదు. సురక్షితంగా ప్రయాణించడం ఎంతో అవసరం. అందునా విమానంలో వుండగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరో ఒకరు సాయంచేయాలి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా నాగ్‌పూర్ విమానాశ్రాయంలో ఆగాల్సి వచ్చింది. విమానంలోని ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. విమానంలో ప్రయాణిస్తున్న మహిళ గర్భవతి.. ఆమె స్వల్ప అనారోగ్యానికి గురైంది. కళ్లుతిరిగి కింద పడిపోయింది. దీంతో ఆమెకు చికిత్స కోసం విమానాన్ని మధ్యలోనే కిందికి దించాల్సి…