హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 12న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు 16 ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు…