ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.. ఏప్రిల్ 8న మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశం కారణంగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. తాజాగా తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది…