Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ అందించింది. డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ఈనెల 11న ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తున్నందున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ…
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మినహా మిగతా అన్ని రోజుల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. Read Also:…
Tirumala Brahmotsavam Celebrations: తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకంతంగానే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండటంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను నాలుగు మాఢవీధుల్లో ఘనంగా నిర్వహించాలని టీటీడీ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే తమిళులకు ఎంతో ముఖ్యమైన పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో…