Super Success Story: మనం ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటాం. చదువుతుంటాం. ఎన్నో సినిమాలు కూడా వీక్షిస్తుంటాం. కానీ.. ఈ ఇంటర్వ్యూ నిజంగా నమ్మశక్యం అనిపించదు. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంది. ఇది.. ‘నాన్నకు ప్రేమతో.. ’ లాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. నభూతో నభవిష్యతి అనిపిస్తుంది.
Robot Man Of India: మనకి రోబో గురించి తెలుసు గానీ రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి తెలియదు. రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మన దేశంలో మొట్టమొదటి రోబోను తయారుచేసిన వ్యక్తి కాదు. ఈయన H-Bots అనే కంపెనీ ఫౌండర్-సీఈఓ. పేరు.. పీఎస్‌వీ కిషన్. ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్‌కి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. H-Bots సంస్థ తొలిసారిగా ఐదేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోలీస్ రోబోను తయారుచేసింది.